Home Page SliderNational

బ్రిజ్ భూషణ్‌ను అరెస్టు చేస్తేనే ఏషియన్ గేమ్స్-రెజ్లర్ల అల్టిమేటం

రెజ్లర్లపై లైంగిక వేధింపులకు పాల్పడిన WFI చీఫ్ బ్రిజ్ భూషణ్‌ను అరెస్టు చేస్తేనే తాము ఏషియన్ గేమ్స్‌లో పాల్గొంటామని, కేంద్రప్రభుత్వానికి అల్టిమేటం జారీ చేశారు రెజ్లర్లు. చాలా కాలంగా నిరసన దీక్షలు చేస్తున్న వీరు నేడు హర్యానాలోని సోనిపట్‌లో ఖాప్ నేతలు నిర్వహించిన మహా పంచాయత్‌లో పాల్గొన్నారు. ప్రభుత్వం రెజ్లర్ల సమస్యలను చిన్నచూపు చూస్తోందని విమర్శించారు. ప్రభుత్వం ఇచ్చిన గడువులోగా తమ సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేశారు. అప్పుడే తాము జరుగబేయే ఏషియన్ గేమ్స్‌లో పాల్గొంటామని, లేదంటే నిరసనలు ఉధృతం చేసి, ఆందోళనలు చేస్తామని హెచ్చరించారు స్టార్ రెజ్లర్ సాక్షి మాలిక్.