బీహార్‌లో ప్రారంభోత్సవానికి ముందే కుప్పకూలిన బ్రిడ్జ్
బీహార్‌లో సిక్తి ప్రాంతంలో కోట్లు ఖర్చు పెట్టి కట్టిన బ్రిడ్జ్ ప్రారంభోత్సవానికి ముందే కుప్పకూలింది. కాగా బక్రా నదికి వరదలు రావడంతో బ్రిడ్జ్‌లోని మూడు పిల్లర్లు కొట్టుకుపోయాయి. దీంతో బ్రిడ్జ్ ఒక్కసారిగా కుప్పకూలింది. అయితే ఈ వంతెనను ఇంకా ప్రారంభించకపోవడంతో ప్రాణనష్టం జరగలేదని అధికారులు తెలిపారు. కాగా 100 మీటర్లలో నిర్మించిన ఈ బ్రిడ్జ్ కోసం ప్రభుత్వం రూ.100 కోట్లు ఖర్చు పెట్టినట్లు తెలుస్తోంది. అయితే ఈ బ్రిడ్జ్ నిర్మాణంలో కాంట్రాక్టర్లు నాసిరకమైన మెటీరియల్‌ను వాడటంతోనే బ్రిడ్జ్ కూలిపోయిందని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.