బ్రేకప్ బాధాకరం: తమన్నా
ఇటీవల తాను ఇచ్చిన ఓ ఇంటర్‌వ్యూలో తన విఫల ప్రేమకథల గురించి గుర్తుచేసుకుంది తమన్నా. ఆమె హృదయం ఇప్పటికే రెండు సార్లు బద్దలైంది. ఈ విషయంపై తమన్నా మాట్లాడుతూ ‘బ్రేకప్ నిజంగా చాలా బాధాకరం. అది అనుభవించిన వారికే తెలుస్తుంది. నా జీవితంలో రెండుసార్లు బ్రేకప్‌ని ఎదుర్కొన్నాను. టీనేజ్‌లో ఉన్నప్పుడే తొలి హార్ట్‌బ్రేక్ ఎదురైంది. జీవితంలో ఏదోఒకటి సాధించాలనేది నా అభిమతం. ఓ వ్యక్తికోసం తన లక్ష్యాన్ని వదులుకోవడం నచ్చలేదు. ఆ కారణంతో ఓ బంధం తెగిపోయింది. అది జరిగిన కొన్నేళ్లకు మరో వ్యక్తిని ఇష్టపడ్డా. అతనితో కొంతకాలం రిలేషన్లో ఉన్నా. అతను మాట్లాడితే ఎక్కువ అబద్ధాలే చెప్పేవాడు. కారణం లేకుండా అనవసరంగా అబద్ధాలాడేవాళ్లంటే నాకు చెడ్డ అసహ్యం. తను నాకు సెట్ కాడని ఎక్కడో తేడా కొట్టింది, దాంతో అతణ్ణి కూడా కట్ చేయక తప్పలేదు. అని గత జ్ఞాపకాలను నెమరు వేసుకుంటూ ఇంటర్వ్యూను ముగించింది.

