ఇంటర్ పరీక్షకు బ్రేకింగ్ రూల్స్
మార్చి 5 నుండి తెలంగాణ ఇంటర్ పరీక్షలు ప్రారంభం కాబోతున్న సంగతి తెలిసిందే. ఇంటర్ బోర్డు పరీక్షల ఏర్పాట్లకై సీఎస్ శాంతి కుమారి శుక్రవారం సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా పలు నియమాలు వెల్లడించారు. ఈ పరీక్షలకు హాజరయ్యే విద్యార్థులు ఎట్టి పరిస్థితులలోనూ ఎలాంటి చేతి వాచీలను అనుమతించేది లేదని స్పష్టం చేశారు. టెక్నాలజీ బాగా పెరిగిపోతుండడంతో ప్రస్తుతం ఎనలాగ్ వాచీలను కూడా నిషేధించారు. విద్యార్థులకు సమయం తెలియడానికి ప్రతీ అరగంటకొకసారి అలారం మోగించాలని, ఇన్విజిలేటర్లు కూడా ప్రతీ అరగంటకీ సమయం చెప్పాలని, ఇంకా సమయం మిగిలిఉందో విద్యార్థులకు తెలియజేస్తూ ఉండాలని వెల్లడించారు.

