ఒలింపిక్ ఛాంపియన్ మను బాకర్‌కు క్యూ కట్టిన బ్రాండ్లు
పారిస్ ఒలింపిక్స్‌లో భారత్ తరపున రెండు కాంస్య పతకాలు సాధించి చరిత్ర సృష్టించిన మను బాకర్ కోసం కంపెనీలు పోటీ పడుతున్నాయి. తమ బ్రాండ్ అంబాసిడర్‌గా ఉండాలంటూ భారీ మొత్తాలు ఆఫర్ చేస్తున్నాయి. పారిస్ ఒలింపిక్స్‌కు ముందు కంటే ఆమెకు ఆరు రెట్లు ఇచ్చేందుకు సంస్థలు పోటీ పడుతున్నాయని స్వయంగా ఆమెకు సంబంధించిన ఎండార్స్‌మెంట్లను మేనేజ్ చేసే ఏజెన్సీ సీఈవో తెలియజేశారు. ఇప్పటికే 40 కంపెనీలు తమను సంప్రదించినట్లు తెలిపారు. గతంలో ప్రతీ ఎండార్స్‌మెంటుకు రూ.20 నుండి రూ.25 లక్షల వరకూ ఆర్జించేదని పేర్కొన్నారు. ఆమెకు ఇప్పుడు రూ.1.5 కోట్ల వరకూ ఇచ్చేందుకు కూడా ఆసక్తిగా ఉన్నట్లు తెలిపారు. ఇప్పటికే ఆసియా గేమ్స్, కామన్వెల్త్ గేమ్స్‌లో పతకాలను సాధించిన ఆమె ఒలింపిక్స్‌లో రెండు మెడల్స్ రావడంతో ఒక్కసారిగా బ్రాండ్ వాల్యూ ఆరు రెట్లు పెంచుకుంది.