ఒలింపిక్స్ వీరుల బ్రాండ్ విలువ కోట్లలో
ఇటీవల జరిగిన పారిస్ ఒలింపిక్స్‌లో భారత్ సాధించిన పతకాలు తక్కువే అయినా బ్రాండ్ విలువ మాత్రం బాగా పెరిగింది. ఒలింపిక్ వీరుల బ్రాండ్ విలువ కోట్ల రూపాయలకు చేరుకుంది. ‘జావెలిన్ త్రో’లో సిల్వర్ మెడల్ సాధించిన నీరజ్ చోప్రా బ్రాండ్ 40 శాతం పైగా పెరిగి రూ.330 కోట్లకు చేరింది. ‘షూటింగ్’లో రెండు కాంస్య పతకాలు సాధించి రికార్డు నెలకొల్పిన మనూ బాకర్ విలువ ఆరు రెట్లు పెరిగిందట. గతంలో ఒక్కో డీల్‌కు రూ.25 లక్షలు తీసుకునే ఆమె తాజాగా ‘థమ్స్ అప్’ యాడ్ కోసం రూ.1.5 కోట్ల ఒప్పందం కుదుర్చుకున్నారని సమాచారం. ఇక చివరి పోటీలో అనర్హతకు గురయి పతకం చేజార్చుకున్న ‘రెజ్లర్’ వినేశ్ ఫోగట్ విలువ కూడా రూ. కోటికి పైగానే పెరిగింది.