బ్రహ్మానందం ప్రచారం ఫెయిల్.. బీజేపీ అభ్యర్థి ఓటమి
టాలీవుడ్ కమెడియన్ బ్రహ్మానందం ఎన్నికల్లో ప్రచారం చేసిన బీజేపీ అభ్యర్థి సుధాకర్ ఓడిపోయారు. బ్రహ్మనందం కర్ణాటక ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న విషయం తెలిసిందే. బీజేపీ నేత, ఆరోగ్య శాఖ మంత్రి సుధాకర్ తరుఫున చిక్ బల్లాపూర్ నియోజకవర్గంలో ఆయన ప్రచారం చేశారు. అయితే.. అక్కడ 11,130 ఓట్ల మెజారిటీలో కాంగ్రెస్ అభ్యర్థి ప్రదీప్ ఈశ్వర్ విజయం సాధించారు. ఈశ్వర్‌కు 69,008 ఓట్లు రాగా, సుధాకర్‌కు 57,878 ఓట్లు వచ్చాయి. ఇక జేడీఎస్ అభ్యర్థి కేపీ బచే గౌడ 13,300 ఓట్లతో మూడో స్థానంలో నిలిచారు. ఏపీకి ఆనుకుని ఉన్న చిక్ బల్లాపూర్ నియజకవర్గంలో తెలుగు ఓటర్లు అధికం. ఈ క్రమంలో గత ఎన్నికల్లోనూ బీజేపీ అభ్యర్థి సుధాకర్ తరఫున బ్రహ్మానందం ప్రచారం చేశారు. అప్పుడు సుధాకర్ గెలిచారు. ఇదే సెంటిమెంట్‌ను రిపీట్ చేయాలనే ఉద్దేశంతో.. బ్రహ్మానందం నాలుగు రోజుల పాటు చిక్ బల్లాపూర్ నియోజకవర్గంలో సుధాకర్ ప్రచారం చేయించారు. కానీ ఈ సారి సెంటిమెంట్ వర్కౌట్ కాలేదు.

