Andhra PradeshHome Page Slider

ఏపీ సీఎంతో భేటీ కానున్న BPCL ప్రతినిధులు

ఏపీ సీఎం చంద్రబాబు నాయుడుతో BPCL ప్రతినిధులు మరి కాసేపట్లో భేటీ కానున్నట్లు తెలుస్తోంది. కాగా మచిలీపట్నంలో రిఫైనరీ ఏర్పాటుకు BPCL సముఖంగా ఉందని ఎంపీ బాలశౌరి వెల్లడించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో BPCL ప్రతినిధులు రాష్ట్రానికి వచ్చినట్లు సమాచారం. కాగా వారు ప్రస్తుతం విజయవాడ దుర్గమ్మను దర్శించుకుంటున్నారు. అయితే మరి కాసేపట్లోనే వారు సీఎం చంద్రబాబుతో సమావేశం కానున్నారు. BPCL రూ.60 వేల కోట్ల పెట్టుబడితో మచిలీపట్నంలో రిఫైనరీ ఏర్పాటు చేయనుంది. కాగా ఈ రిఫైనరీ ఏర్పాటుకు ఏపీ ప్రభుత్వం 2-3 ఎకరాల భూమిని ఇచ్చేందుకు సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. అయితే దీని ద్వారా ఏపీలో 25వేలమందికి ఉపాధి లభించే అవకాశం ఉందని ప్రభుత్వ వర్గాలు స్పష్టం చేశాయి.