Home Page SliderTelangana

డ్రైవర్ కు బీపీ డౌన్.. చెట్లపొదల్లోకి దూసుకెళ్లిన ఆర్టీసీ బస్సు

ఆర్టీసీ బస్సు నడుపుతున్న డ్రైవర్ కు ఒక్కసారిగా బీపీ డౌన్ అయింది. దీంతో అతడు బస్సుపై నియంత్రణ కోల్పోగా బస్సు అదుపుతప్పి రోడ్డు పక్కన చెట్లపొదల్లోకి దూసుకెళ్లింది. ఈ ఘటన నిజామాబాద్ నగరంలోని బైపాస్ రోడ్డులో ఇవాళ ఉదయం చోటు చేసుకుంది. ప్రమాద సమయంలో బస్సులో 25 మంది ఉండగా ముగ్గురికి స్వల్ప గాయాలయ్యాయి. బస్సు పాక్షికంగా ధ్వంసం అయింది. స్థానికులు బస్సులోని ప్రయాణికులను క్షేమంగా బయటకు తీశారు.