టర్కీ ఆపిల్స్ బహిష్కరణ
పాకిస్థాన్‌కు మద్దతు ఇచ్చినందుకు టర్కీ ఆపిల్స్ ను వ్యాపారస్తులు బహిష్కరిస్తున్నారు. టర్కీ పాకిస్థాన్‌కు మద్దతు ఇచ్చిన కారణంతో పుణేలో ఆపిల్ వ్యాపారులు టర్కీ ఆపిల్స్‌ను కొనడం ఆపేశారు. భారత వ్యాపారులు హిమాచల్ మరియు ఇతర దేశీయ ప్రాంతాల ఆపిల్స్‌కు ప్రాధాన్యం ఇస్తున్నట్టు తెలిపారు. టర్కీ ఆపిల్ వ్యాపారం సుమారు రూ.1200 కోట్ల వరకు ఉండగా, ఇది పూర్తిగా నిలిచే అవకాశం ఉంది.

