బాయ్‌కాట్ ఇండియా- పాకిస్తాన్ మ్యాచ్
ఇండియా పాకిస్తాన్ ప్రపంచ కప్ మ్యాచ్‌ను బాయ్‌కాట్ చేయమంటూ నెటిజన్లు ట్విటర్లో పోస్టులు పెడుతున్నారు. ఈ పోస్టులు బాగా ట్రెండింగ్‌లో ఉన్నాయి. ప్రస్తుత ఇజ్రాయెల్-పాలస్తీనా హమాస్ ఉగ్రవాదుల మధ్య జరుగుతున్న యుద్ధం కూడా దీనికి కారణంగా చెప్పవచ్చు. భారత్ ఇజ్రాయెల్‌కు మద్దతుగా ఉగ్రవాదానికి వ్యతిరేకంగా పోరాడుతుండగా పాకిస్తాన్ పాలస్తీనాలోని హమాస్ ఉగ్రవాదులకు మద్దతు పలుకుతోంది. అంతేకాక భారత్‌లోని కొన్ని ముస్లిం మత సంఘాలు కూడా పాలస్తీనాకు మద్దతుగా ఉన్నట్లు ప్రకటించారు. దీనితో కొందరు మండిపడుతున్నారు. పాకిస్తాన్ ఉగ్రవాదులు భారత సైనికులను చంపడానికి ప్రణాళికలు వేస్తుంటే, భారత్ మాత్రం వారి క్రికెటర్లను ఆహ్వానించి మ్యాచ్‌లు ఆడిస్తోందని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అందుకే బాయ్‌కాట్ ఇండియా వెర్సస్ పాకిస్తాన్ మ్యాచ్ అంటూ సోషల్ మీడియాలలో కామెంట్లు చేస్తున్నారు. ప్రస్తుతం హ్యాష్‌ట్యాగ్ ఇండోపాక్ మ్యాచ్ అంటూ ట్విటర్లో ట్రెండింగ్‌లో ఉంది.

