Breaking NewsHome Page Sliderhome page sliderNationalSports

షమీ లాంటి బౌలర్లు చాలా అరుదు: గిల్

భారత టెస్ట్ కెప్టెన్ శుభ్‌మన్ గిల్ షమీపై ప్రశంసల వర్షం కురిపించారు. “షమీ లాంటి బౌలర్లు చాలా తక్కువమంది మాత్రమే ఉంటారు,” అని ఆయన తెలిపారు.

ప్రెస్ కాన్ఫరెన్స్‌లో మాట్లాడిన గిల్, “ఆయన్ను ఎందుకు సెలక్ట్ చేయలేదు, భవిష్యత్తులో అవకాశం ఇస్తారా అనే ప్రశ్నలకు నేను సమాధానం ఇవ్వడం కష్టం. ఆ విషయాన్ని సెలక్టర్లే బెటర్‌గా చెబుతారు,” అని అన్నారు.

ప్రస్తుతం జట్టులో ఉన్న బౌలర్లు అద్భుతంగా రాణిస్తున్నారని గిల్ పేర్కొన్నారు. రేపు ప్రారంభమయ్యే దక్షిణాఫ్రికాతో తొలి టెస్ట్ మ్యాచ్లో ఆల్‌రౌండర్‌ లేదా అదనపు స్పిన్నర్‌ను ఆడించాలా అనే విషయంలో రేపే తుది నిర్ణయం తీసుకుంటామని తెలిపారు.