పవన్ కళ్యాణ్‌పై బొత్స సంచలన వ్యాఖ్యలు
ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌పై సంచలన వ్యాఖ్యలు చేశారు వైసీపీ నేత బొత్స సత్యనారాయణ. ‘పవన్ కళ్యాణ్‌కు ప్రతిపక్ష హోదాపై అసలు అవగాహన లేదు. సంఖ్యాపరంగా తమ జనసేన పార్టీకే ఎక్కువ సీట్లు వచ్చాయంటున్నారు. జనసేనకు ప్రతిపక్ష హోదా కావాలంటే కూటమి ప్రభుత్వం నుండి బయటకు రండి’ అంటూ డిమాండ్ చేశారు బొత్స సత్యనారాయణ. అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద ఆయన మాట్లాడుతూ ‘బడ్జెట్ ప్రసంగంపై నేను మాట్లాడాను. ప్రజల తరపున మాట్లాడుతున్నాం. ఎన్నికల ముందు చంద్రబాబు ప్రకటించిన సూపర్ సిక్స్ ఏమయ్యింది?. సంపద సృష్టి ఏమయ్యింది?. ఉద్యోగులకు, ప్రజలకు ఇచ్చిన ఏ ఒక్క హామీని నెరవేర్చలేదు’. అంటూ మండిపడ్డారు.

