మూడు రాజధానులపై బొత్స కీలక వ్యాఖ్యలు..
గత వైసీపీ ప్రభుత్వం ప్రకటించిన 3 రాజధానుల అంశంపై వైసీపీ నేత, మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ యూటర్న్ తీసుకున్నారు. గతంలో ఈ అంశంపైనే ఎన్నికలకు వెళతాం అని ప్రకటించిన ఆయన ఇప్పుడు అప్పటి పరిస్థితులను బట్టి అలా మాట్లాడానని చెప్తున్నారు. మూడు రాజధానులపై మా పార్టీ విధానంపై మరోసారి చర్చించాలని ఆలోచిస్తున్నామి పేర్కొన్నారు. గతంలో అమరావతి స్మశానంలా ఉందని నేను చెప్పింది అప్పటి పరిస్థితులను బట్టి చెప్పానని, అమరావతిని శాసన రాజధానిగా చేద్దామని అనుకున్నామని పేర్కొన్నారు. ఈ విధానం ప్రజలకు నచ్చలేదని, ప్రతిపాదిత మూడు రాజధానుల ప్రాంతంలో కూడా వైసీపీకి సీట్లు రాకపోవడంతో ఈ నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది.