Andhra PradeshHome Page Slider

తెలంగాణ విద్యావ్యవస్థపై బొత్స కీలక వ్యాఖ్యలు

తెలంగాణ విద్యావ్యవస్థపై కీలక వ్యాఖ్యలు చేశారు ఏపీ విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ. తెలంగాణలో చూచివ్రాతలు, పేపర్ లీకేజిలు, స్కాములు సాధారణం అన్నారు. రోజుకో అరెస్టు జరుగుతోందన్నారు. తెలంగాణాలో ఒక సరైన విధానం లేదని, పద్దతి లేదని విమర్శించారు. ఉపాధ్యాయులను కూడా బదిలీలు చేయలేని స్థితిలో తెలంగాణ ప్రభుత్వం ఉందన్నారు. తెలంగాణాకు ఏపీకి అసలు పోలికలే లేవన్నారు. ఏపీని తెలంగాణాతో పోల్చేదే లేదన్నారు. ఏపీ ప్రభుత్వం విద్యార్థుల బంగారు భవిష్యత్తుకు బాటలు వేస్తోందన్నారు. విద్యార్థుల కోసం ఏపీ సీఎం జగన్ అనేక పథకాలు తెచ్చారన్నారు. అమ్మఒడి లాంటి పథకాలను అందిస్తున్నారని, దేశానికే ఆదర్శంగా ఏపీ విద్యావ్యవస్థ ఉందన్నారు బొత్స. ఏపీ విద్యావిధానాలే మంచివని, ఆచరించదగినవి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ వ్యాఖ్యలపై తెలంగాణా ప్రభుత్వం నుండి ఏపీకి విమర్శల వెల్లువ తప్పదంటున్నారు మీడియావర్గం వారు.