Home Page SliderTelangana

ఫ్లాట్ విషయంలో దాడికి పాల్పడ్డ ఇరువర్గాలు

ప్లాట్ విషయంలో ఇరువర్గాలు దాడికి పాల్పడ్డారు. కర్రలు, బండలు, డ్రమ్ములతో దాడి చేసుకున్నారు. ఈ ఘటన తెలంగాణలోని మేడ్చల్ – సురారం పీఎస్ పరిధిలో జరిగింది. కృషికాలనీలో 132గజాల ఓ ప్లాట్ విషయంలో ఘర్షణ జరిగింది. స్వరాజ్యం(29), చైతన్య, లక్ష్మీ, అనూషతో పాటు మరికొంతమంది పై కర్రలు, బండలు, డ్రమ్ములతో ఓ వర్గం దాడిచేసింది. ఈ దాడిలో పల్లపు వీరయ్య అనే వ్యక్తికి తీవ్రగాయాలయ్యాయి. వెంటనే ఆయనని మల్లారెడ్డి ఆసుపత్రికి తరలించారు. స్వరాజ్యం(29)అనే మహిళ పోలీసులకు పిర్యాదు చేయడంతో కేసు నమోదు చేశారు. మరోవైపు దాడిచేసిన వర్గం కుడా పీఎస్ లో పిర్యాదు చేశారు. ఇరువర్గాలపై కేసు నమోదు చేసి పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.