తెలంగాణలో విజృంభిస్తున్న జ్వరాలు
హైదరాబాద్: తెలంగాణలో వైరల్ ఫీవర్ కేసులు ఎక్కువగా ఉన్నాయి. వర్షాలు పడుతుండడం, వాతావరణ మార్పులతో విష జ్వరాలు చుట్టుముట్టాయి. ఎక్కువమంది ఆసుపత్రుల్లో చేరుతుండటంతో ఆసుపత్రులన్నీ రోగులతో కిటకిటలాడుతున్నాయి. దోమలు వ్యాప్తి చెందడంతో జ్వరాలు కూడా ఎక్కువ అవుతున్నాయని డాక్టర్లు చెబుతున్నారు. డెంగ్యూ కేసులు కూడా వెలుగు చూడటంతో ప్రజలు భయపడి జ్వరం వచ్చిన వెంటనే ఆసుపత్రి వద్దకు పరుగులు పెడుతున్నారు.

