Home Page SliderInternationalNational

ఫేక్ టికెట్లు అమ్మారన్న ఆరోపణలపై బుక్ మై షో సీఈవోకు సమన్లు…

బ్రిటీష్ రాక్ బ్యాండ్ కోల్డ్‌ప్లే షోల టిక్కెట్లను బ్లాక్ మార్కెటింగ్ చేస్తున్నారనే ఆరోపణలపై బుక్‌మైషో చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్, వ్యవస్థాపకుడు ఆశిష్ హేమ్రజనీ, కంపెనీ టెక్నికల్ హెడ్‌కు ముంబై పోలీసులు నోటీసులు పంపించారు. నవీ ముంబైలోని డివై పాటిల్ స్టేడియంలో జనవరి 19 నుండి 21, 2025 వరకు జరగనున్న కోల్డ్‌ప్లే ఈవెంట్‌కు టిక్కెట్లను బ్లాక్‌మార్కెటింగ్‌కు పాల్పడ్డరాని న్యాయవాది ఫిర్యాదుపై ముంబై పోలీస్ ఎకనామిక్ అఫెన్సెస్ వింగ్ (EOW) విచారణ ప్రారంభించింది. హేమరజనీ, బుక్‌మైషో టెక్నికల్ హెడ్‌ని శనివారం… వారి స్టేట్‌మెంట్‌లను రికార్డ్ చేయాల్సిందిగా కోరినట్లు అధికారులు తెలిపారు. కోల్డ్‌ప్లే ఇండియా టూర్ టిక్కెట్‌లను, వాస్తవానికి ₹ 2,500 ధరను కలిగి ఉండగా, వాటిని థర్డ్ పార్టీ, ఇతరులు ₹ 3 లక్షలకు తిరిగి విక్రయిస్తున్నారని లాయర్, అమిత్ వ్యాస్, పోలీసులకు ఫిర్యాదు చేశారు. బుక్‌మైషో ప్రజలను, కోల్డ్‌ప్లే అభిమానులను మోసం చేసిందని, మోసం ఆరోపణలపై కంపెనీపై కేసు నమోదు చేయాలని ఆయన కోరారు. పోలీసులు ఇప్పటికే లాయర్ వ్యాస్ స్టేట్‌మెంట్‌ను రికార్డ్ చేశారు.

మొత్తం వ్యవహారంపై దర్యాప్తు చేయాలని మాజీ సీఎం శివసేన అధినేత ఉద్ధవ్ థాక్రే డిమాండ్ చేశారు. “టికెట్లు ఆన్‌లైన్‌లో అందుబాటులోకి వచ్చిన కొద్ది నిమిషాల్లోనే అమ్ముడయ్యాయి, ఇది చాలా మంది నిజమైన అభిమానులను నిరాశకు గురిచేసింది … ఇష్టపడే యువ అభిమానుల ఉత్సాహాన్ని దోపిడీ చేస్తూ టిక్కెట్ల బ్లాక్ మార్కెటింగ్‌లో అమ్ముండొచ్చు. ఈవెంట్‌కి హాజరు కావడానికి వారి తల్లిదండ్రులు కష్టపడి సంపాదించిన డబ్బును పెద్ద మొత్తంలో ఖర్చు చేయాల్సి ఉంటుందని, ఇది వారికి బారమని శివసేన (యుబిటి) ప్రతినిధి ఆనంద్ దూబే మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఏక్‌నాథ్ షిండేకు రాసిన లేఖలో పేర్కొన్నారు. తక్షణం జోక్యం చేసుకోవాలని ఆయన డిమాండ్ చేసారు. బీజేపీ నేతలు సైతం ఇలాంటి ఆరోపణలే చేయడం విశేషం.