ఉచిత గ్యాస్ ఇలా బుక్ చేయండి
ఏపీలో ఉచిత గ్యాస్ లబ్దిదారులకు ప్రభుత్వం గ్యాస్ ఎలా బుక్ చేయాలో ఉత్తర్వులు జారీ చేసింది. పాత విధానంలోనే గ్యాస్ ఏజెన్సీ నెంబర్ ద్వారా కానీ, ఆయిల్ కంపెనీ యాప్‌లో కానీ బుక్ చేయవచ్చు. ఆధార్ కార్డు, రేషన్ కార్డులు, బ్యాంక్ అకౌంట్లు లింక్ అయిన గ్యాస్ వినియోగదారులకు గ్యాస్‌కు చెల్లించిన మొత్తం అందుతుంది. సబ్సిడీ సొమ్ము గ్యాస్ సిలిండర్ తీసుకున్నాక, చెల్లించిన డబ్బు 48 గంటలలోగా వారి అకౌంట్లో క్రెడిట్ అవుతుంది.