‘సింగరేణి కార్మికులకు దసరాకు ముందే బోనస్’..రేవంత్ రెడ్డి
రాష్ట్రానికే తలమానికంగా నిలిచిన సింగరేణి సంస్థలో పనిచేసే కార్మికులకు సంతోషంగా బోనస్‌ను అందజేయడానికి అంగీకరిస్తున్నామని పేర్కొన్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. దసరా పండుగకు ముందే ఈ లాభాలు పంచుతామన్నారు. దీనిపై వివరాలను ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క తెలియజేశారు. సింగరేణి కంపెనీని విస్తరించే ప్రయత్నాలు చేస్తున్నామన్నారు. సింగరేణి కార్మికులకు బోనస్‌గా కంపెనీ లాభాలలో ప్రతీ ఉద్యోగికి రూ.1,90,000 పంచుతున్నామని పేర్కొన్నారు. కాంట్రాక్టు ఉద్యోగులు కూడా 25 వేలమంది ఉన్నారని పేర్కొన్నారు. మొట్టమొదటి సారిగా సింగరేణి సంఘాలు, యాజమాన్యం, ప్రభుత్వం కలిసి ఆలోచించి, ఒక్కొక్కరికీ రూ.5 వేల చొప్పున పంచుతున్నాని పేర్కొన్నారు. సింగరేణికి సోలార్ పవర్ కూడా ఏర్పాటు చేస్తామన్నారు. థర్మల్ పవర్ ప్లాంటును కూడా విస్తరిస్తామన్నారు. ఇంతమంచి నిర్ణయం తీసుకున్నందుకు ప్రభుత్వానికి, సింగరేణి యాజమాన్యానికి కృతజ్ఞతలు చెప్పారు భట్టి విక్రమార్క.

