జులై 7 నుండి బోనాల ఉత్సవాలు ప్రారంభం
టిజి: రాష్ట్ర సంస్కృతీ సంప్రదాయాలకు అద్దంపట్టే పండుగ బోనాలు. జులై 7వ తేదీ నుండి బోనాలు ప్రారంభమవుతాయి. కొత్తకుండలో సగానికి సున్నం, పైభాగానికి నూనె రాసి, పసుపు, కుంకుమలు పూసి, చందనం పూస్తారు. ఘటాన్ని అన్నంతో నింపి, దానిచుట్టూ మామిడి, వేప ఆకులతో దండలు వేస్తారు. ఘటంపై దీపం వెలిగించడానికి మట్టి ప్రమిద పెట్టి దీపం వెలిగించి ముత్తైదువలతో కలిసి గుడికి వెళ్లి బోనం సమర్పిస్తారు.