బాలీవుడ్ ప్రముఖులకు బాంబు వార్నింగ్ కాల్స్
ఈ మధ్య కాలంలో అంబానీ ఇంటిలో బాంబు పెట్టినట్లు ఓ బెదిరింపు కాల్ వచ్చింది. ఈ ఫోన్ కాల్ అప్పట్లో తీవ్ర కలకలం సృష్టించింది. అయితే ఇప్పుడు ప్రముఖ బాలీవుడ్ అగ్రకథానాయకుడు అమితాబ్ బచ్చన్ ,ధర్మేంద్రకు కూడా ఇలాంటి బెదిరింపు కాల్స్ వచ్చాయి. వారి ఇళ్లల్లో బాంబు పెట్టామంటూ నిన్న ఉదయం నాగ్‌పూర్ పోలీస్ స్టేషన్‌కు ఆగంతకులు ఫోన్ చేశారు. దీంతో అప్రమత్తమైన పోలీసులు వెంటనే సంబంధిత ప్రాంతాలలో తనిఖీలు చేపట్టారు. అయితే అక్కడ ఎటువంటి పేలుడు పదార్ధాలు లభించలేదని పోలీసులు వెల్లడించారు. పోలీసులు దీనిపై కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. కాగా పోలీసులు బెదిరింపు కాల్స్ చేసిన వారిని కనిపెట్టే పనిలో పడ్డారు.

