మరోసారి స్కూళ్లకు బాంబు బెదిరింపులు
దేశ రాజధాని ఢిల్లీలోని పాఠశాలలకు బాంబు బెదిరింపులు వచ్చాయి. వరుసగా రెండో రోజు స్కూళ్లకు బెదిరింపులు రావడం గమనార్హం. ఆర్కేపురం ఢిల్లీ పబ్లిక్ స్కూల్, ర్యాన్ ఇంటర్నేషనల్ స్కూల్, వసంత్ కుంజ్ సహా పలు పాఠశాలలకు ఇవాళ ఉదయం బెదిరింపు ఈ-మెయిల్స్ వచ్చినట్లు పోలీసులు తెలిపారు. బరీ అల్లా పేరుతో గ్రూప్ మెయిల్ వచ్చిందని పోలీసులు తెలిపారు. children- nofallah@outlook.com నుంచి థ్రెట్ ఈ-మెయిల్ వచ్చినట్లు వెల్లడించారు. బాంబు డిటెక్షన్ టీమ్, అగ్నిమాపక అధికారులు తనిఖీలు చేపట్టగా అనుమానాస్పదంగా ఏమీ కనుక్కోలేదని తెలిపారు. స్కూళ్లకు బెదిరింపులు రావడం ఈ వారంలో ఇది మూడోసారి.