ఎయిర్ పోర్ట్ కు మరోసారి బాంబు బెదిరింపులు
తెలంగాణలోని హైదరాబాద్ శంషాబాద్ ఎయిర్ పోర్ట్ కు మరోసారి బాంబు బెదిరింపు మెయిల్ వచ్చింది. దీంతో ఎయిర్ పోర్ట్ సెక్యూరిటీ సిబ్బంది అప్రమత్తమై ముమ్మర తనిఖీలు చేపట్టింది. చివరకు బాంబు మెయిల్ ఫేక్ అని తేలడంతో అధికారులు ఊపిరి పీల్చుకున్నారు. అయితే బాంబు బెదిరింపు మెయిల్ ఎక్కడి నుంచి వచ్చిందనే దానిపై అధికారులు ఆరా తీస్తున్నారు.

