Home Page SliderNational

దేశంలోని 40 ఎయిర్‌పోర్ట్‌లకు బాంబు బెదిరింపులు

భారతదేశంలోని దాదాపు 40 ఎయిర్‌పోర్ట్‌లకు బాంబు బెదిరింపులు రావడం దేశవ్యాప్తంగా తీవ్ర సంచలనం సృష్టిస్తోంది.కాగా ఢిల్లీ,పాట్నా,జైపూర్,కోయంబత్తూర్‌తోపాటు వడోదరా ఎయిర్‌పోర్ట్‌లకు బాంబు బెదిరింపులు వచ్చినట్లు తెలుస్తోంది. ఎయిర్‌పోర్ట్‌లను పేల్చేస్తామంటూ దుండగులు మెయిల్స్ పంపించారు.దీంతో అప్రమత్తమైన అధికారులు ఈ 40 ఎయిర్‌పోర్ట్‌ల్లో బాంబ్ స్వ్కాడ్‌తో తనిఖీలు చేపట్టారు.