వారణాసి వెళ్లే విమానానికి బాంబు బెదిరింపు
వారణాసి వెళ్లే విమానానికి బాంబు బెదిరింపు తీవ్ర కలకలం సృష్టించింది. బెంగళూరు నుంచి అకస ఎయిర్ లైన్స్ విమానం 200 మంది ప్రయాణికులతో వారణాసికి బయలుదేరింది. బయలుదేరిన కొద్దిసేపటికీ విమానంలో బాంబు పెట్టామని బెదిరింపు కాల్ రావడంతో విమానాన్ని అత్యవసరంగా శంషాబాద్ విమానాశ్రయంలో ల్యాండింగ్ చేశారు. విమానంలో సీఐఎస్ఎఫ్ పోలీసులు డాగ్ స్క్వాడ్, బాంబు స్క్వాడ్ తో క్షుణ్ణంగా తనిఖీలు నిర్వహించారు. విమానంలో ఎలాంటి పేలుడు పదార్థాలు లభించకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు.

