ఎయిర్ ఇండియా విమానానికి బాంబు బెదిరింపు
ముంబై నుంచి న్యూయార్క్ వెళ్తున్న ఎయిర్ ఇండియా విమానానికి బాంబు బెదిరింపు కాల్స్ రావడంతో అర్థాంతరంగా ఢిల్లీ విమానాశ్రయంలో ల్యాండ్ అయింది. ఈ ఘటన ఇవాళ తెల్లవారుజామున జరిగింది. పోలీసు అధికారులు విమానంలో తనిఖీలు చేపట్టారు. భద్రత ప్రమాణాల పరిశీలన పూర్తయిన తర్వాత విమానం ఢిల్లీ ఎయిర్ పోర్ట్ నుంచి బయలుదేరుతుందని వెల్లడించారు. అయితే.. ఇటీవలే హైదరాబాద్ రాజీవ్ గాంధీ ఎయిర్ పోర్టుకు కూడా ఇండిగో విమానానికి ఇలాగే బాంబు బెదిరింపు వచ్చింది. అయితే అది ఫేక్ కాల్ అని తేలడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు.