Home Page SliderTelangana

TCS కంపెనీలో బాంబు కలకలం

ప్రముఖ సాఫ్ట్‌వేర్ కంపెనీ TCSలో బాంబు బెదిరింపు కాల్ కలకలం సృష్టించింది. హైదరాబాద్ నగరంలోని సాఫ్ట్‌వేర్ మల్టీ నేషనల్ కంపెనీ TCSకు బాంబు బెదిరింపు కాల్ వచ్చింది. కాగా మాధాపూర్‌లోని TCS బ్రాంచ్‌కు ఓ గుర్తు తెలియని వ్యక్తి ఆఫీసులో బాంబు పెట్టినట్లు బెదిరింపు కాల్ చేశారు. దీంతో అప్రమత్తమైన కంపెనీ యాజమాన్యం  మాధాపూర్ పోలీసులకు సమాచారం అందించారు. సమాచారం అందుకున్న పోలీసులు హూటాహుటిన TCS కంపెనీకి చేరుకొని..ముందుగా ఉద్యోగులందరినీ బయటకు పంపించారు. అనంతరం బాంబు స్క్వాడ్‌తో తనిఖీలు చేపట్టారు. తనిఖీల్లో అక్కడ ఎటువంటి పేలుడు పదార్థాలు లేవని పోలీసులు గుర్తించారు. అయితే గతంలో TCS కంపెనీలో సెక్యూరిటీ విభాగంలో పనిచేసిన మాజీ ఉద్యోగి ఈ బెదిరింపు కాల్ చేసినట్లు పోలీసులు గుర్తించినట్లు తెలుస్తోంది. అతడిని పట్టుకునేందుకు పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు.