ప్రియురాలి ఇంటిపై బాంబ్.. బ్రేకప్ చెప్పిందని ప్రియుడి రివేంజ్..
తన ప్రేమను తిరస్కరించిన ప్రియురాలి ఇంటిపై బాంబ్ వేసిన ఓ ప్రియుడు. ప్రస్తుతం ఈ న్యూస్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. వివరాల్లోకి వెళితే.. థాయిలాండ్ లో ఓ వ్యక్తి.. తన ప్రేమికురాలు బ్రేకప్ చెప్పడంతో చాలా హర్ట్ అయ్యాడు. ఏం చేయాలో తెలియక సతమతమయ్యాడు. రివేంజ్ తీసుకునే క్రమంలో ఆమె ఇంటిపై గ్రెనేడ్ విసిరాడు. అది పేలడంతో మరణించాడు. ఈ సంఘటన మే 25, 2025న దక్షిణ థాయిలాండ్ లోని సూరత్ థానీలో జరిగింది. 36 ఏళ్ల సురపాంగ్ థాంగ్నాక్ తన మాజీ భాగస్వామి కనోన్ఫత్ సావోఖోన్ తనతో ఉండేందుకు నిరాకరించడంతో కోపంతో ఆమె ఇంటిపై బాంబ్ విసిరాడు. అయితే ఆ గ్రెనేడ్ ఒక స్తంభాన్ని తాకి.. తిరిగి వచ్చి పేలింది. దీంతో అతడు చనిపోయాడు. గ్రెనేడ్ విసిరినప్పుడు అమ్మాయి కుటుంబం అక్కడి నుంచి పారిపోగా.. అదృష్టవశాత్తూ ఎవరికీ హాని జరగలేదు. పోలీసులు ఈ సంఘటనను ధృవీకరించగా.. సోషల్ మీడియాలో ఈ వార్త వైరల్ గా మారింది.

