కాలినడకన తిరుమలకు బాలీవుడ్ టాప్ హీరోయిన్ దీపిక పడుకొనె
ఫైటర్ మూవీ విడుదలకు ముందు దీపికా పదుకొనె, సోదరి అనీషాతో కలిసి తిరుమల ఆలయంలో స్వామి ఆశీస్సులు తీసుకున్నారు. రాబోయే యాక్షన్ థ్రిల్లర్ ఫైటర్ కోసం దీపిక సిద్ధమవుతున్నారు. గురువారం రాత్రి వేంకటేశ్వరుని ఆశీస్సులు పొందేందుకు ఆమె తిరుమల ఆలయానికి వచ్చారు. శుక్రవారం ఉదయం శ్రీవేంకటేశ్వర స్వామిని దర్శించుకున్నారు. దీపిక, ఆమె సోదరి కాలి నడకన తిరుమల చేరుకున్నారు. మార్గమధ్యలో అభిమానుల కేరింతలతో ఆమె కొండపైకి చేరుకున్నారు. అభిమానులకు సెల్ఫీలు తీసుకునేందుకు అవకాశం ఇచ్చారు.