Home Page SliderNational

డిజైనర్ దుస్తులతో వేదికపై బాలీవుడ్ తారల తళుకులు

బాలీవుడ్ తారలను చూస్తేనే అభిమానులకు పూనకాలు వస్తాయి. అలాంటిది తమ అభిమాన తారలందరూ ఒకే వేదికపై డిజైనర్ దుస్తులతో తళుకులీనితే అభిమానులకు కన్నులపండుగే. ముంబైలోని ప్రముఖ బాలీవుడ్ సెలబ్రిటీ డిజైనర్‌గా పేరు పొందిన మనీష్ మల్హోత్రా చాలా గ్రాండ్‌గా బ్రైడల్ కోచర్ షో నిర్వహించారు. తన ఫ్యాషన్ బ్రాండ్‌ను ప్రారంభించి 18 ఏళ్లు పూర్తయ్యిందట. ఈ సందర్భంగా మోడల్స్‌తో పాటు సినీ తారలను కూడా తన వేడుకలో పాల్గొనడానికి ఆహ్వానించారు.

దీనితో తారలు హాజరై సందడి చేశారు. అలియా భట్, జాన్వికపూర్, శ్రియాశరణ్,దీపికా పదుకొనే,కాజోల్, రణవీర్ సింగ్, రకుల్ ప్రీత్ సింగ్, సోనాలి బింద్రే వంటి స్టార్స్‌తో పాటు రిలయన్స్ అధినేత ముకేష్ అంబానీ కూడా కుటుంబంతో సహా హాజరై వేడుకలు తిలకించారు. అలియాభట్ పెళ్లికుమార్తె దుస్తుల్లో మెరిసిపోతూ అందరినీ ఆకట్టుకుంది.