మహిళా క్రికెట్ గ్రౌండ్‌లో బాలీవుడ్ తళుకులు
మహిళల క్రికెట్ ప్రీమియర్ లీగ్ సీజన్ కాసేపట్లో మొదలుకాబోతోంది. ఈ ప్రారంభ ఉత్సవాలకు బాలీవుడ్ హంగులు అద్దబోతున్నారు. హీరోయిన్లు కృతిసనన్, కియారా అధ్వానీలు నృత్యప్రదర్శన చేయబోతున్నారు. వీరి డాన్స్‌తో పాటు పంజాబీ రాప్ సింగర్ ఏపీ దిల్లాన్ కూడా పాల్గొనబోతున్నాడు. వీరి రిహార్సల్‌కు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ముంబైలోని డీవై పాటిలో క్రికెట్ స్టేడియంలో ముంబై ఇండియన్స్, గుజరాత్ జెయింట్స్ టీమ్‌ల మధ్య మొదటి మ్యాచ్ ప్రారంభం కాబోతోంది. ఈ మ్యాచ్‌ను జియోసినిమా యాప్‌లోనూ, స్పోర్ట్స్ 18 నెట్‌వర్క్‌లోనూ లైవ్ స్ట్రీమింగ్ చూడవచ్చు.