Home Page SlidermoviesNationalTrending Today

చిరుతో జత కట్టనున్న బాలీవుడ్ సీనియర్ హీరోయిన్

మెగాస్టార్ చిరంజీవి విశ్వంభర తర్వాత చేయబోయే కొత్త చిత్రానికి హీరో నాని సమర్పకునిగా వ్యవహరిస్తున్నారు. ఈ చిత్రానికి దసరా మూవీ డైరెక్టర్ శ్రీకాంత్ ఓదెల దర్శకునిగా పనిచేస్తున్నారు. అయితే ఈ చిత్రానికి సంబంధించి ఒక ఆసక్తికర విషయం వెలుగులోకి వచ్చింది. చిరుకు జోడీగా బాలీవుడ్ సీనియర్ హీరోయిన్ రాణీ ముఖర్జీ నటిస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఈ చిత్రంలో హీరోయిన్ పాత్రకు చాలా ప్రాముఖ్యత ఉందని, అందుకే అనుభవం గల చక్కని సీనియర్ నటి కోసం ప్రయత్నించే క్రమంలో బాలీవుడ్ అందాల నటి రాణిముఖర్జీ అయితే ఈ చిత్రానికి సూటవుతారని చిరంజీవికి చెప్పగా, ఆయన కూడా మంచి సెలక్షన్ అని మెచ్చుకున్నారట. దీనితో వీరిద్దరి కొత్త కాంబినేషన్ కోసం చిరు అభిమానులు ఎదురు చూస్తున్నారు.