Home Page SliderNational

రూ.1000కోట్లకు సగం వాటాలు అమ్మేసిన  బాలీవుడ్ నిర్మాత

ప్రముఖ బాలీవుడ్ నిర్మాత కరణ్ జోహార్‌ తనకు చెందిన ధర్మ ప్రొడక్షన్స్‌లో 50 శాతం వాటాలు రూ.1000 కోట్లకు అమ్మేశారు. మొదట్లో రిలయెన్స్ సంస్థ దీనిని దక్కించుకుంటుందని రూమర్స్ వచ్చినా చివరికి ప్రముఖ పారిశ్రామికవేత్త అడర్ పునావాలాకి చెందిన సెరెన్ ప్రొడక్షన్స్ ఈ వాటాలు రూ.1000 కోట్లకు దక్కించుకుంది. అంటే ఈ మొత్తాన్ని ధర్మ ప్రొడక్షన్స్‌లో ఇన్వెస్ట్ చేయనుంది. కరోనా అనంతర పరిణామాల వల్ల బాలీవుడ్ పరిస్థితి దివాలా స్థాయికి చేరుకుంది. చెప్పుకోదగిన హిట్ చిత్రాలు లేవు. ఇటీవల వచ్చిన కరణ్ జోహార్ చిత్రాలన్నీ పరాజయాన్ని చవిచూశాయి. రీసెంట్‌గా రిలీజైన ఆలియా భట్ చిత్రం  జిగ్రా కూడా ప్లాప్ టాక్‌తో నడుస్తోంది.