National

బాలీవుడ్ హీరోయిన్స్ కర్వాచౌత్ సందడి

బాలీవుడ్ నటీమణులు నిన్న జరిగిన కర్వాచౌత్ వేడుకల ఫొటోలతో సోషల్ మీడియాలో బాగా సందడి చేస్తున్నారు. అభిమానుల శుభాకాంక్షలందుకుంటున్నారు. భర్త శ్రేయస్సును ఆశిస్తూ చేసే కర్వాచౌత్ పండుగను భక్తి శ్రద్ధలతో జరుపుకున్న ఫొటోలను ఇన్‌స్టాగ్రామ్‌లో, ట్విటర్‌లలో షేర్ చేస్తూ వేడుకలు జరుపుకున్నారు. శిల్పాశెట్టి, రవీనాటాండన్‌లు అనిల్ కపూర్ నివాసంలో ఆయన సతీమణి సునీతతో పాటు వేడుకలలో పాల్గొన్నారు.

కొత్తగా వివాహం చేసుకున్న అలియాభట్-రణబీర్ కపూర్, కత్రినాకైఫ్- విక్కీ కౌశల్, మౌనీరాయ్- సూరజ్ దంపతులు ఈ పండుగను ఘనంగా జరుపుకున్నారు. శిల్పాశెట్టి తన భర్తను జల్లెడలో చూసే ఫొటోను షేర్ చేసింది. భక్తితో ఉదయం నుండి ఉపవాసంతో ఉండి అమ్మవారికి పూజలు చేసిన ఫొటోలను, చంద్రదర్శన ఫొటోలను షేర్ చేసుకుంటూ సందడి చేస్తున్నారు.