Home Page SliderNationalNews Alert

షూటింగ్‌లో బాలీవుడ్‌ దర్శకుడికి తీవ్ర గాయాలు.. ఆస్పత్రికి తరలింపు

హైదరాబాద్‌ శివారులో జరుగుతున్న బాలీవుడ్‌ సినిమా షూటింగ్‌లో ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ఘటనలో బాలీవుడ్‌ దర్శక, నిర్మాత రోహిత్‌ శెట్టికి షూటింగ్‌లో తీవ్ర గాయాలయ్యాయి.. దీంతో ఆయనను ఎల్‌బీ నగర్‌లోని కామినేని ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం ఆయనకు వైద్యులు చికిత్స అందిస్తున్నారు. అయితే.. మూవీ షూటింగ్‌, ప్రమాదానికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. రోహిత్‌ శెట్టి సినిమాల్లో ఎక్కువ శాతం యాక్షన్‌ చిత్రాలే ఉంటాయి. హైదరాబాద్‌ శివారులో ఆయన ఇండియన్‌ పోలీస్‌ ఫోర్స్‌ పేరుతో ఒక వెబ్‌ సిరీస్‌ తెరకెక్కిస్తున్నారు. ఒక చేజింగ్‌ సీన్‌ షూటింగ్‌ చేస్తున్న సమయంలో ఆయన గాయపడినట్లు తెలుస్తోంది. జమీన్‌ అనే సినిమాతో దర్శకుడిగా రోహిత్‌ శెట్టి పరిచయమయ్యారు. ఆ తర్వాత గోల్మాల్‌, గోల్మాల్‌ రిటర్న్స్‌, గోల్మాల్‌ 3, చెన్నై ఎక్స్‌ప్రెస్, సింగం, సింగం రిటర్న్స్‌, దిల్వాలే, సూర్యవంశి వంటి సినిమాలతో ప్రేక్షకులను అలరించారు.