బాలీవుడ్ దర్శక నిర్మాత ప్రదీప్ సర్కార్ కన్నుమూత
పరిణీత, హెలికాప్టర్ ఈలా, మర్దానీ వంటి చిత్రాలకు దర్శకత్వం వహించిన దర్శక నిర్మాత ప్రదీప్ సర్కార్, 67 సంవత్సరాల వయస్సులో మరణించారు. మార్చి 24 తెల్లవారుజామున 3.30 గంటలకు కన్నుమూశారు. సర్కార్ పరిణీత, లగా చునారీ మే దాగ్, మర్దానీ మరియు హెలికాప్టర్ ఈలా చిత్రాలకు దర్శకత్వం వహించారు. సినిమాల్లోకి రాకముందు, ప్రదీప్ సర్కార్ అనేక ప్రముఖ మ్యూజిక్ వీడియోలు, వాణిజ్య ప్రకటనలకు దర్శకత్వం వహించాడు. 2005లో పరిణీతతో దర్శకుడిగా పరిచయం అయ్యాడు. ఈ చిత్రంలో విద్యాబాలన్, సైఫ్ అలీ ఖాన్, సంజయ్ దత్ నటించారు. 2018లో దర్శకత్వం వహించిన హెలికాప్టర్ ఈలా ప్రదీప్ సర్కారు చివరి మూవీ. ఈ మూవీలో కాజోల్ ప్రధాన పాత్రలో నటించింది.

