జక్కన్నపై ప్రశంసల వర్షం కురిపించిన బాలీవుడ్ బ్యూటీ
టాలీవుడ్ టాప్ డైరెక్టర్ రాజమౌళి RRR సినిమాతో ప్రపంచానికి తెలుగువాడి సత్తా ఏంటో చూపించాడు. కాగా ఈ సినిమా ఎంతో ప్రతిష్టాత్మకమైన ఆస్కార్ అవార్డును సైతం కైవసం చేసుకున్న విషయం తెలిసిందే. దీంతో ఈ ఏడాది టైమ్స్ మ్యాగజైన్ ప్రకటించిన 100 మంది ప్రభావశీలుర జాబితాలో టాలీవుడ్ జక్కన్నకు కూడా చోటు దక్కించుకున్నారు. ఈ నేపథ్యంలో బాలీవుడ్ బ్యూటీ క్వీన్,RRR సినిమాతో టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చిన ఆలియా భట్ రాజమౌళిపై ప్రశంసల వర్షం కురిపించారు. కాగా రాజమౌళి తాను రాసుకున్న కథను ఎంతో అద్భుతంగా తెరకెక్కించగలరని పేర్కొన్నారు. అంతేతాకుండా ఆయన నుంచి ఎన్నో కొత్త అంశాలు నేర్చుకోవచ్చని ఆలియా భట్ తెలిపారు. అయితే ఓసారి నటన పరంగా సలహ ఇవ్వాలని ఆలియా భట్ రాజమౌళిని కోరినట్లు ఆలియా చెప్పారు. దీనికి సమాధానంగా ఏ క్యారెక్టర్ అయినా సరే ప్రేమతో చెయ్యాలని రాజమౌళి ఆమెకు సూచించినట్లు ఆలియా వాఖ్యానించారు. ఒకవేళ సినిమా ఆడినా..ఆడకపోయినా..మనం చేసిన పాత్ర ప్రజలకు ఎప్పటికీ గుర్తుండిపోయేలా ఉండాలని రాజమౌళి చెప్పినట్లు ఆలియా భట్ స్పష్టం చేశారు.