Home Page SliderNational

బాలీవుడ్‌ నటి, థియేటర్ ఆర్టిస్ట్ ఉత్తరా బావోకర్ కన్నుమూత

ప్రముఖ నటి, థియేటర్ ఆర్టిస్ట్ ఉత్తరా బావోకర్ 79 ఏళ్ల వయసులో మహారాష్ట్రలోని పూణె నగరంలో దీర్ఘకాలంగా అనారోగ్యంతో మరణించారని ఆమె కుటుంబానికి సన్నిహిత వర్గాలు తెలిపాయి. గత ఏడాది కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఉత్తరా బావోకర్ ఆస్పత్రిలో తుదిశ్వాస విడిచారు. నేషనల్ స్కూల్ ఆఫ్ డ్రామాలో నటనను అభ్యసించిన ఉత్తరా బావోకర్, ముఖ్యమంత్రిలోని పద్మావతి, మేనా గుర్జారిలో మేన, షేక్స్‌పియర్ ఒథెల్లోలోని డెస్డెమోనా, నాటక రచయిత గిరీష్ కర్నాడ్ తుగ్లక్‌లో తల్లి వంటి విభిన్న నాటకాలలో వివిధ పాత్రలు పోషించారు. గోవింద్ నిహ్లానీ చిత్రం తమస్‌లో ఆమె పాత్ర తర్వాత ఉత్తరా బావోకర్ వెలుగులోకి వచ్చారు. ఆమె సుమిత్రా భావే చలనచిత్రాలలో కూడా నటించింది. చిత్ర నిర్మాత సునీల్ సుక్తాంకర్ ఆమెతో దాదాపు ఎనిమిది చలన చిత్రాలలో పనిచేశారు. ఉత్తరా బావోకర్‌ను, బలమైన స్త్రీ పాత్రలను పోషించగల నటిగా సుమిత్రా భావే పరిగణించేవారని ఆయన అన్నారు. సినిమాల్లో వైవిధ్యమైన స్త్రీ పాత్రలు పోషించడంతోపాటుగా, క్రమశిక్షణ కలిగిన నటిగా… సెట్స్‌లో ఉన్నప్పుడు ఆమె ప్రవర్తన ఎందరికో ఆదర్శంగా నిలిచేదని గుర్తు చేసుకున్నారు.