Home Page SliderNational

బాలీవుడ్ నటికి విమానంలో వేధింపులు

బాలీవుడ్ నటి ఉర్ఫీ జావేద్ తనకు విమానంలో వేధింపులు ఎదురయ్యాయంటూ ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ పెట్టారు. కొందరు వ్యక్తులు ముంబయి నుండి గోవాకు వెళ్లే విమానంలో తనతో ప్రయాణించారని, ఆ సమయంలో తనతో అభ్యంతరకరంగా మాట్లాడారని, వేధించారని పేర్కొన్నారు. అసభ్యంగా ప్రవర్తించారని, వారంతా మద్యం సేవించి ఉన్నారని తెలిపారు. వారి వైఖరి తనకు భయం కలిగించిందని, తాను ఎదురుతిరిగానని ఈ ఇన్‌స్టా పోస్టులో రాసుకొచ్చారు. ఈమధ్య జరిగిన మణిపూర్ మహిళల సంఘటన విషయంలో ఆమె వారికి మద్దతుగా సోషల్ మీడియాలో పోస్టులు పెట్టారు. గతంలో హిందీలోని ధారావాహికలలో కూడా నటించారు. హిందీ బిగ్‌బాస్‌ సీజన్‌లో సందడి చేశారు.