Home Page SliderInternational

రూ.42 కోట్ల వాచ్ ధరించిన బాలీవుడ్ నటుడు

బాలీవుడ్ స్టార్స్ ఎంత లగ్జరీగా ఉంటారో మనకు కొంతవరకూ తెలుసు. కానీ కోట్ల రూపాయల ఖరీదుతో వాచీలు కూడా కొంటారని ఊహించలేం. బాలీవుడ్ దిగ్గజ స్టార్ సల్మాన్ ఖాన్‌కు ఊహించని అదృష్టం లభించింది. అమెరికన్ జువెలరీ, లగ్జరీ వాచ్ డిజైనర్ జాకబ్ అరబో దాదాపు రూపాయలలో 42 కోట్ల ఖరీదు చేసే వాచీని సల్మాన్ చేతికి తొడిగారు. సల్మాన్ తన అభిమాన నటుడని అందుకే ఈ వాచ్‌ను పెట్టుకోవడానికి ఎవ్వరినీ అనుమతించనని, కానీ సల్మాన్‌కు తానే స్వయంగా వాచీని తొడిగానని చెప్పుకొచ్చారు జాకబ్. ఈ వాచ్‌లో కళ్లు చెదిరే ఖరీదైన డైమండ్స్ 714 ఉన్నాయి. దీని విలువ రూ.42 కోట్లు చేస్తుంది. అయితే దీనిని సల్మాన్‌కు బహుమతిగా ఇవ్వలేదు. కేవలం అలంకరించి వీడియోలు మాత్రం తీశారు. ఈ వీడియోలను సోషల్ మీడియాలో పోస్టు చేయగా వైరల్ అవుతున్నాయి.