Home Page SliderNational

మహారాష్ట్ర ఎన్నికల ప్రచారంలో బాలీవుడ్ నటుడు

మహారాష్ట్ర ఎన్నికలు సమీపిస్తుండడంతో  ప్రచారం జోరుగా కొనసాగుతోంది. తాజాగా బాలీవుడ్ నటుడు, అందాల తార జెనీలియా భర్త రితేశ్ దేశ్‌ముఖ్ ప్రచారంలో పాల్గొన్నారు. రితేశ్ సోదరుడు లాతూర్ నుండి కాంగ్రెస్ అభ్యర్థిగా ధీరజ్ దేశ్‌ముఖ్ తరపున ఆయన ప్రచారం చేశారు. ఈ ప్రచారంలో కీలక వ్యాఖ్యలు చేశారు రితేశ్. చిత్తశుద్ధితో పని చేయని వారు మాత్రమే మతం గురించి మాట్లాడుతారని ఆయన విమర్శించారు. మతం గురించి మాట్లాడకుండా, ముందు అభివృద్ధి గురించి మాట్లాడాలని సవాల్ చేశారు. ప్రస్తుత పాలనలో యువతకు ఉద్యోగాలు లేవని, వారికి ఉపాధి కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వానిదే అన్నారు. దివంగత మాజీ ముఖ్యమంత్రి విలాస్ రావ్ దేశ్‌ముఖ్ కుమారులే ధీరజ్ దేశ్‌ముఖ్, రితేశ్ దేశ్‌ముఖ్. ప్రస్తుతం ధీరజ్ కాంగ్రెస్ పార్టీలో కొనసాగుతున్నారు. 2019 ఎన్నికలలో కూడా ఆయన లక్షకు పైచిలుకు ఓట్లతో గెలుపొందారు.