చంద్రబాబు ప్రమాణ స్వీకారం సందర్భంగా కనువిందు చేసిన పడవల ర్యాలీ
చంద్రబాబు ప్రమాణ స్వీకారం సందర్భంగా విజయవాడ కృష్ణానదిలో పసుపురంగు పడవల ర్యాలీ కనువిందు చేసింది. మంతెన ఆశ్రమం నుండి ప్రకాశం బ్యారేజి వరకూ ఈ ర్యాలీ కొనసాగింది. అమరావతి ఇసుక పడవల యాజమాన్యం ఈ ర్యాలీని నిర్వహించింది. టీడీపీ నాయకుడు చంద్రబాబు, జనసేన నాయకుడు పవన్ కళ్యాణ్‌ల ప్రమాణ స్వీకారానికి అభినందనలు తెలుపుతూ ఆ పడవలపై టీడీపీ, జనసేన, బీజేపీ జెండాలు అలంకరించారు.

