మెట్రో రైలు ఎక్కండి.. దిగాక టిక్కెట్ తీసుకోండి
తెలంగాణ: హైదరాబాద్ మెట్రోలో మరింత అధునాతన టికెటింగ్ విధానం చూడబోతున్నామా? అవుననే అంటోంది ఎల్ అండ్ టీ హైదరాబాద్ మెట్రో రైలు సంస్థ. విదేశాల్లో మాదిరి ఓపెన్ లూప్ టిక్కెటింగ్ వ్యవస్థ(ఓటిఎస్)ను ప్రవేశపెట్టనుంది. ముందే టిక్కెట్ తీసుకోవాల్సిన పనిలేదు. దిగిన తర్వాత ప్రయాణించిన దూరాన్ని బట్టి ఛార్జీ వసూలు చేస్తారు. కొత్త విధానాన్ని ఈ ఆర్థిక సంవత్సరంలో ప్రవేశపెట్టాలనే ప్రణాళికలో మెట్రో రైలు సంస్థ ఆలోచిస్తోంది.