Andhra PradeshHome Page Slider

వైసీపీకి దెబ్బ మీద దెబ్బ

ఏపీలో వైసీపీ పార్టీకి దెబ్బ మీద దెబ్బ తగులుతోంది. కాగా ఈ రోజు ఉదయమే తాడేపల్లిలోని వైసీపీ కార్యాలయాన్ని CRDA అధికారులు కూల్చివేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో మరో వైసీపీ కార్యాలయానికి కూడా నోటీసులు వచ్చినట్లు తెలుస్తోంది. కాగా విశాఖపట్నం సమీపంలోని ఎండాడలో వైసీపీ కార్యాలయానికి GVMC నోటీసులు ఇచ్చింది. అయితే ఈ భవనం నిర్మాణం అక్రమంగా జరిగిందని GVMC అందులో పేర్కొంది. ఈ మేరకు తక్షణమే అందులో పార్టీ కార్యకలాపాలు నిలిపివేసి,వారం రోజుల్లోగా వివరణ ఇవ్వాలని కోరింది. అలా వివరణ ఇవ్వని పక్షంలో చర్యలు తప్పవని GVMC వైసీపీ పార్టీని హెచ్చరించింది.