ఈ పార్టీకి దెబ్బ మీద దెబ్బ
ఏపీలో వైసీపీ పార్టీకి దెబ్బ మీద దెబ్బ పడుతోంది. వరుసగా ఎమ్మెల్సీలు, ఎంపీలు చేజారిపోతున్నారు. తాజాగా ఎమ్మెల్సీలు పద్మశ్రీ, కళ్యాణ చక్రవర్తి, తమ పదవులకు రాజీనామా చేసి, కూటమిలో చేరనున్నారు. ఇప్పటికే తమ రాజీనామా పత్రాలను మండలి ఛైర్మన్‌కు అందజేస్తున్నారు. వైసీపీ పార్టీకి కూడా రిజైన్ చేయనున్నారు. నిన్ననే వైసీపీకి రాజ్యసభ ఎంపీలు బీదమస్తాన్ రావు, మోపిదేవవెంకటరమణలు వైసీపీని వీడారు. రెండు రోజుల క్రితం ఎమ్మెల్సీ పోతుల సునీత కూడా రాజీనామా చేసిన సంగతి తెలిసిందే.