దేవరగట్టులో రక్తతర్పణం… 70 మందికి పైగా గాయాలు
దేవరగట్టు మరోసారి రక్తసిక్తమయ్యింది. ఏపీలో ఏటా కర్నూలు జిల్లా హోళగుంద మండలం దేవరగట్టులో నిర్వహించే కర్రల సమరంలో 74 మంది గాయపడ్డారు. తీవ్ర గాయాలైన వారిలో కొందరి పరిస్థితి విషమంగా ఉండటంతో ఆస్పత్రికి తరలించారు. దసరా పర్వదినం సందర్భంగా ఈ మాళ మల్లేశ్వర స్వామికి బిన్ని ఉత్సవం నిర్వహించడం ఏటా ఆనవాయితీ… ఈ ఏడాది భారీ వర్షాలతో బన్నీ ఉత్సవం కొంత ఆలస్యంగా మొదలయ్యింది.

కర్రల సమరానికి వెళ్తూ కర్నాటకకు చెందిన శిరుగుప్పకు చెందిన రవీంద్రనాథ్ రెడ్డి మృతిచెందారు. దేవరగట్టులో 800 అడుగుల ఎత్తులో కొండపై మాళ మల్లేశ్వర స్వామి ఆలయం ఉంది. స్వామి మూర్తులను దక్కించుకోడానికి గ్రామ ప్రజలు రెండు వర్గాలుగా విడిపోయి.. కర్రల సాములో పాల్గొంటారు. నెరణికి, నెరణికి తండా, కొత్త పేట గ్రామాలు ఓవైపు.. అరికెర, అరికెరతండా, సుళువాయి, ఎల్లార్తి, కురుకుంద, బిలేహాల్, విరుపాపురం గ్రామస్తులు మరోవైపు ఢీకొంటారు. దశాబ్దాలుగా ఈ ఉత్సవం కొనసాగుతోంది.