రక్తదాన శిబిరంలో ఇలా చేస్తారా..!
ప్రముఖ పార్టీకి చెందిన మహిళా నేత ఓవరాక్షన్ చేసి నవ్వుల పాలైంది. ఈ ఘటన తమిళనాడులో జరిగింది. తమిళనాడు మాజీ సీఎం పళనిస్వామి పుట్టినరోజు సందర్భంగా రక్తదాన శిబిరాలు ఏర్పాటు చేశారు.అయితే.. తిరువణ్ణామలైలో ఏర్పాటు చేసిన ఓ రక్తదాన శిబిరంలో ఆ పార్టీ జిల్లా కార్యదర్శి జయసుధ రక్తం ఇస్తున్నట్లు ఫొటోలు దిగి నవ్వులపాలయ్యారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. వీడియో చూసిన నెటిజన్లు పలు రకాలుగా ఫన్నీ కామెంట్లు చేస్తున్నారు.