మహిళలకు వరాలు.. మేడిగడ్డ బ్యారేజీని చెక్ చేసిన రాహుల్
జయశంకర్ భూపాలపల్లి, మహదేవపూర్, కాటారం: కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ పర్యటన విజయవంతమైంది. ఆయన జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహదేవపూర్ మండలం అంబట్‌పల్లి, మేడిగడ్డలో మొత్తం గంట 12 నిమిషాల పాటు ఉన్నారు. ముందుగా మేడిగడ్డ సమీపంలోని బ్యారేజీ వద్ద ఏర్పాటు చేసిన హెలిప్యాడ్‌కు చేరుకున్నారు. అక్కడి నుండి అంబట్‌పల్లిలో ఏర్పాటు చేసిన మహిళా సదస్సులో పాల్గొన్నారు. ప్రభుత్వ తీరును ఎండగడుతూనే మహిళలకు పలు హామీలిచ్చారు. మహాలక్ష్మీ పథకం ద్వారా చేకూరే లబ్ధిని వివరించారు. అనంతరం మేడిగడ్డ సందర్శనకు వెళ్లారు. మేడిగడ్డ బ్యారేజీపై 16 నిమిషాలు గడిపారు. పిల్లర్ల కుంగుబాటుకు కారణాలను ఇంజినీర్లను అడిగి తెలుసుకున్నారు.