InternationalNews

అమిత్‌ షా పర్యటనకు ముందు జమ్మూలో పేలుళ్లు..

కేంద్ర హోం మంత్రి అమిత్‌ షా పర్యటనకు ముందు జమ్మూకశ్మీర్‌లో వరుస పేలుళ్లు కలకలం సృష్టించాయి. బుధవారం రాత్రి ఉధంపూర్‌లో ఓ బస్సులో జరిగిన భారీ పేలుడుకు ఓ కండక్టర్‌, మరో వ్యక్తి గాయపడ్డారు. గుర్తు తెలియని వ్యక్తులు రామ్‌గఢ్‌కు పంపించేందుకు బస్సుపై కొన్ని దుప్పట్లను లోడ్‌ చేసిన తర్వాతే పేలుడు జరిగిందని ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. గురువారం తెల్లవారుజాము 5 గంటలకు ఉధంపూర్‌ బస్టాండ్‌లో నిలిపిన ఓ బస్సు పేలింది.

రేపు అమిత్‌ షా పర్యటన..

అమిత్‌ షా శుక్రవారం జమ్మూకశ్మీర్‌లో పర్యటించనున్న నేపథ్యంలో జరిగిన పేలుళ్లతో భద్రతా బలగాలు మరింత అప్రమత్తమయ్యాయి. అమిత్‌ షా దర్శించుకోనున్న త్రికూట్‌ హాల్స్‌లోని మాతా వైష్ణోదేవి ఆలయం వద్ద భారీ భద్రతను ఏర్పాటు చేశారు. రాజౌరీ, బారాముల్లా పట్టణాల్లో అమిత్‌ షా ర్యాలీలు కూడా నిర్వహిస్తారు. మరోవైపు పూంచ్‌ జిల్లాలో ఓ మహిళ దగ్గర నుంచి నాలుగు కిలోల ఐఈడీని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.